calender_icon.png 19 April, 2025 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం పదవికి శ్రీధర్‌బాబు అర్హుడే

12-04-2025 12:00:00 AM

  1. వారికి వసూలు చేయడం రాకే సీఎంను మార్చడం లేదు
  2. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అర్వింద్

హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తోందని.. ఈ నేపథ్యంలో రేవంత్ తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు మంత్రి శ్రీధర్‌బాబుకు మాత్రమే ఉన్నాయని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు.

పార్టీలోని కొందరు నేతల్లాగా శ్రీధర్‌బాబుకు అక్రమ వసూళ్లు చేయడం చేతకాదని.. అందుకే ఆ పార్టీ అధిష్ఠానం ఆయన్ను సీఎంను చేసేందుకు వెనకడుగు వేస్తోందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిలా శ్రీధర్‌బాబు సీసీపీయూ (కనెక్ట్  కలెక్ట్ పే  యూజ్) కోర్సు చేయలేదని తెలిపారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధర్మపురి మాట్లాడారు.

అక్రమ వసూళ్లకు పాల్పడటం, అధిష్ఠానానికి మూటలు పంపడం శ్రీధర్‌బాబుకూ తెలిసిఉంటే.. ఆయనే సీఎం అయ్యేవాడని అన్నారు. మరోవైపు కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఓ బీజేపీ ఎంపీ సీఎం రేవంత్‌రెడ్డికి సహక రిస్తున్నాడంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలపైనా అర్వింద్ స్పందించారు. కేటీఆర్‌కు దమ్ముంటే ఆ బీజేపీ ఎంపీ ఎవరో పేరు చెప్పాలని డిమాండ్ చేశారు.

బాధ్యతాయుతమైన ప్రతిపక్షంలో ఉం డి, అవినీతికి సంబంధించిన విషయాలు తెలిసి కూడా పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. ఐసీఐసీఐ నుంచి రుణాలు తీసుకుంటే ముందు ఆ బ్యాంక్‌పై విచారణ జరగాలన్నారు. ఇదివరకే హెచ్‌సీయూకు ఇచ్చిన భూములపై అప్పు ఎలా తెస్తారని నిలదీశారు. 

హామీలు నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్..

రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని, పరిపాలన చేతకావడం లేదన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని, వాటిని నెరవేర్చాలన్న తపన కూడా ప్రభుత్వానికి లేదన్నారు. ఏడాదిన్నర పాలనలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు హైడ్రా, పుష్ప, కులగణన, హెచ్‌సీయూ మీద పడ్డారని ఆరోపించారు.

కేసీఆర్ చేసిన అప్పులపై రేవంత్‌రెడ్డి మాట్లాడినంత మరెవరూ మాట్లాడలేదని, లక్షల కోట్ల అప్పు ఉందని తెలిసినా ఎందుకు అమలుకాని వాగ్దానాలు ఇచ్చారని నిలదీశారు. ప్రగతిభవన్‌లో లంకెబిందెలు ఉండవని, ఫామ్‌హౌస్‌లో ఉంటాయని, ద మ్ముంటే అక్కడికి వెళ్లాలని సీఎంకు సవాల్ విసిరారు.

గజదొంగ గంగన్న.. ఆయన కొడుకు రంగన్న

కేసీఆర్, కేటీఆర్ వ్యవహారం గజదొంగ గంగన్న.. ఆయన కొడుకు రంగన్నను తలపిస్తోందని అర్వింద్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ పక్కన ఉన్న అవినీతి అధికారు లే.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి పంచన చేరారని ఆరోపించా రు. కమీషన్లు మింగుడు తప్ప మంత్రులు ఏం చేయడం లేద ని దుయ్యబట్టారు. ప్రజలింకా ఇబ్బందులు పడాలని.. అప్పుడు బయటకు వస్తానని కేసీఆర్ అనుకుంటున్నారని.. ఇది దొర మనస్తత్వమని వాపోయారు.

బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వమని రేవంత్‌రెడ్డి అంటున్నారని.. తెలంగాణలో బీజేపీ లెటెస్ట్ కాలే అంజిరెడ్డి, మల్క కొమరయ్య అంటూ అర్వింద్ కౌంటర్ వేశారు. మంత్రులు మోదీ చేసిన పనులను ప్రశంసిస్తున్నారన్నారు. పవన్ కల్యాణ్‌పై మాట్లాడే అర్హత కవితకు లేదని అన్నారు. రేవంత్‌రెడ్డిని జైళ్లో పెట్టి వేధించిన విషయాన్ని ఆయన మర్చిపోయారని..

తాను అధికారంలోకి వచ్చినా గత ప్రభుత్వం చేసిన అక్రమాలపై బాధ్యులైన వారిని అరెస్ట్ చేసేందుకు కూడా సీఎంకు ధైర్యం సరిపోవడం లేదన్నారు. మోదీని తిడుతూనే సబర్మతి రివర్ ఫ్రంట్‌ను కాపీ, పేస్ట్ చేసేందుకు గుజరాత్ వెళ్లారంటూ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులను ఆయన ఎంపీ అర్వింద్‌కుమార్ ఎండగట్టారు.