calender_icon.png 7 January, 2025 | 12:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా శ్రీధర్‌బాబు

04-01-2025 12:54:31 AM

బ్మాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్‌తో భేటీ

హైదరాబాద్: తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం సచివాలయంలో భారత బ్మాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపిచంద్ సహా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు మంత్రి శ్రీధర్‌బాబును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం స్పోర్ట్స్ ప్రోత్సాహానికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తుందని తెలిపారు.

బ్యాడ్మింటన్‌ను ప్రోత్సహించాలని పుల్లెల గోపిచంద్ అకాడమీ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి క్రీడలను ప్రోత్సహించడానికి స్పోర్ట్స్ యునివర్సిటీ ఏర్పాటుకు సంకల్పించారని వెల్లడించారు.

గ్రామీణ ప్రతిభను వెలికి తీయడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. అందుకోసం దీర్ఘకాలిక ప్రణాళికలు తయారు చేస్తున్నామని చెప్పారు. అంతకముందు నేటి నుంచి 10వ తేదీ వరకు జరగనున్న ఆల్ ఇండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీకి సంబంధించిన బ్రౌచర్‌ను మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఈ టోర్నీ జరుగుతోంది.