13-03-2025 01:03:47 PM
కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సదానందం
ముత్తారం,(విజయక్రాంతి): ముత్తారం మండల లోని చివరి ఆయకట్టు రైతులకు సాగు నీటిని అందించడమే మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం అన్నారు. ముత్తారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొడ్డ బాలాజీ, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మద్దెల రాజయ్య తదితరులతో కలిసి ఆయన మాట్లాడుతూ మంథని, ముత్తారం మండలానికి చెందిన కొంత మంది బిఆర్ ఎస్ పార్టీ నాయకులు సాగునీటి విషయంలో అవాకు చివాకులు మాట్లాడుతున్నారని, వారు పది సంవత్సరాలు అధికారంలో ఉండి కనీసం శ్రీపాద టు టిఎంసి ప్రాజెక్ట్ నీ కంప్లీట్ చేయలేదని విమర్శించారు.
2008 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి స్వర్గీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మాజీ స్పీకర్ శ్రీపాద రావు ఆలోచనల విధానం మేరకు తనయులు శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారని, ఆ తర్వాత పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వంలో పుట్ట మధుకర్ అధికారంలో ఉండి పాదయాత్రల పేరుతో ప్రజలను మభ్యపెడుతూ శ్రీపాద 2టీ ఎమ్ సి ప్రాజెక్టు పనిని నత్తనడకన కొనసాగించారని, ఈరోజు కలబోల్లి మాటలు మాట్లాడుతున్నారి, ఉదాహరణకు ధర్యపూర్ గ్రామంలో ఓ రైతు ల్యాండ్ యాక్టివేషన్ పూర్తి కాలేదని కాలువను ఆపేశాడని, 10 సంవత్సరాలు అధికారంలో ఉండి రైతు తోటి సంప్రదింపులు చేయకుండా అలాగే వదిలిపెట్టిన మీరు శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఆ రైతు తోటి మాట్లాడి ధర్యపూర్ గ్రామ చెరువులోకి నీరు వచ్చే విధంగా కృషి చేయడం జరిగిందన్నారు.
అలాగే అడవి శ్రీరాంపూర్ గ్రామానికి కెనాల్ ద్వారా నీరును విడుదల చేయడం జరిగిందన్నారు. కేశనపల్లి నుండి ముత్తారం వరకు నీరు అందాయని, మీరు వెళ్లి చూడండని, 2 టిఎంసి నుండి రైతులకు ఎన్ని రోజులు నీరు కావాలో అన్ని రోజులు నీరు అందించడానికి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించి ఇప్పటికీ 20 రోజుల నుండి నీరు మోటార్ల ద్వారా ఇప్పించిన ఘనత శ్రీధర్ బాబు, సోదరుడు శ్రీను బాబు కే దక్కిందని, ఇంకా రైతులకు ఎంత మేరకు నీరు అవసరమో పది రోజులైనా 12 రోజులైనా విడుదల చేయడానికి శ్రీధర్ బాబు ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గాదం శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బక్కతట్ల వినీత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చొప్పరి సంపత్, లక్కం ప్రభాకర్, కోల విజయ్, పీక శంకర్ తదితరులు పాల్గొన్నారు.