11-03-2025 12:00:00 AM
లెజెండరీ నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషి కపూర్ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు యత్నిస్తున్నారు. ప్రస్తుతం శ్రీదేవి నటించిన చివరి చిత్రం సీక్వెల్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. దానిలో ఆమె చిన్న కూతురు నటించేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ఐఫా వేడుకలో బోనీకపూర్ స్వయంగా వెల్లడించారు. శ్రీదేవి చివరి సారిగా ‘మామ్’ చిత్రంలో నటించారు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌ను తెరకెక్కించనున్నట్టు బోనీకపూర్ వెల్లడించారు.
ఐఫా వేడుకలో తన భార్య శ్రీదేవిని గుర్తు చేసుకున్న బోనీ.. ఈ క్రమంలోనే తన కుమార్తెలు తల్లి అడుగు జాడల్లో నడుస్తున్నారన్నారు. “ఖుషీ ఇప్పటి వరకూ నటించిన సినిమాలన్నీ అద్భుతంగా చేసింది. ఆమెతో ప్రస్తుతం నేను కూడా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నా.
అది ‘మామ్ 2’ కావొచ్చు. శ్రీదేవి నటించిన అన్ని భాషల్లోనూ స్టార్‌గా ఎదిగారు. ఖుషీ, జాన్వీలు తమ తల్లిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్నారు. వారు కూడా తమ తల్లి మాదిరిగానే గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తున్నా” అని శ్రీదేవి చెప్పుకొచ్చారు.