calender_icon.png 30 October, 2024 | 8:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీచక్ర ‘రహస్యం ఇదం జగత్’

11-08-2024 12:05:00 AM

సైన్స్ ఫిక్షన్, మైథాలాజికల్ థ్రిల్లర్స్ జానర్‌లో రాబోతున్న చిత్రం ‘రహస్యం ఇదం జగత్’. రాకేశ్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం ముఖ్యతారలుగా రూపొందుతున్న సినిమా ఇది. కోమల్ ఆర్ భరద్వాజ్ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా డేట్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌ను చిత్రబృందం శనివారం విడుదల చేసింది. నవంబర్ 8న ఈ మూవీని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. పురాణాలు, ఇతిహాసాల్లోని శ్రీచక్రం గురించి చెబుతున్నట్టు గ్లింప్స్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.