calender_icon.png 6 March, 2025 | 3:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చరికొండలో శ్రీ వేణుగోపాలస్వామి కల్యాణం

06-03-2025 12:00:00 AM

కడ్తాల్, మార్చి 5 (విజయక్రాంతి) : రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం చరికొండ  గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి కళ్యాణం  ఆలయ ధర్మకర్త  శ్రీనివాసచార్యుల  ఆధ్వ ర్యంలో బుధవారం  వైభవంగా జరిగింది. స్వామివారి కల్యాణానికి పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

వేద పండితుల మధ్య స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. ఉత్సవ విగ్రహాలను పట్టు వస్త్రాలతో అలంకరించి స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. నాయకులు వెంకటేష్ గుప్తా, అద్దాల రాములు, నర్సింహా గౌడ్, భక్తులు, అర్చకులు పాల్గొన్నారు.