28-04-2025 08:27:17 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మాకుల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం హుండీ లెక్కింపు నిర్వహించగా 2,88,543 రూపాయలు వచ్చింది. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ఈవో వేణుగోపాల్, ఎండోమెంట్ పర్యవేక్షణ అధికారి సమత, ఆలయ చైర్మన్ జగన్నాథ చార్యులు, ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, గంట్ల రంగారెడ్డి, అర్చకులు పాల్గొన్నారు.