calender_icon.png 22 February, 2025 | 12:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయాలి

21-02-2025 08:47:24 PM

పీకే ఓసి పిఓ, ఆలయ కమిటీ చైర్మన్ లక్ష్మీపతి గౌడ్..

మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా పీవీ కాలనీలో కొలువై ఉన్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మార్చి 1 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయాలని పీకే ఓసి ప్రాజెక్ట్ అధికారి, ఆలయ కమిటీ చైర్మన్ తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఏరియా KPUG గనిలో జరిగిన బ్రహ్మోత్సవాల నిర్వహణ, ఆర్థిక సహకార ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని కార్మికులనుద్దేశించి మాట్లాడారు.

మణుగూరు ఏరియా ఉద్యోగుల, సింగరేణి యాజమాన్యం, భక్తుల సహకారంతో పివి కాలనీలో నిర్మించుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను ప్రతి సంవత్సరం నిర్విఘ్నంగా జరుపుకుంటున్నామని, స్వామివారి కరుణ, కటాక్షాలతో జరుగునున్న బ్రహ్మోత్సవాల నిర్వాణకు ప్రతి ఏడాది మాదిరిగానే ఆర్థికంగా సహకరించాలని, లోక కళ్యాణార్థం కన్నుల పండువగా, అంగ రంగ వైభవంగా జరగనున్న బ్రహ్మోత్సవాలలో కుల, మతాలకతీతంగా కుటుంబ సభ్యులతో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని ఆకాంక్షించారు.

బ్రహ్మోత్సవాల చివరి రోజున జరిగే అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కొండాపురం భూగర్భ గని ఎస్ఓయం పి నరసింహారావు, అడిషనల్ మేనేజర్ ఆర్ మధు బాబు, పీకే ఓసి రక్షణ అధికారి ఎం లింగ బాబు, కార్మిక సంఘాల నాయకులు వత్సవాయి కృష్ణంరాజు, పి రామకృష్ణ, నాగేల్లి వెంకట్, కట్కోజుల శ్రీనివాస్, యస్ డి నాసర్ పాషా, సంక్షేమ అధికారులు డి నరేష్, కె అరుణ్ తేజ, సర్వేయర్ రాజేశ్వరరావు, టివైఎస్సి సైదులు, ట్రైనీ అండర్ మేనేజర్లు కుంచపు భార్గవి, నవ్య, మైనింగ్ సిబ్బంది, సింగరేణి కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.