30-04-2025 05:18:28 PM
మహదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు)115వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ మాట్లాడుతూ... "కదిలేది కదిలించేది పెను నిద్దుర వదిలించేది"ఆని శ్రీశ్రీ కవిత్వం జాతిని జాగృతం చేసిన మహాకవి శ్రీశ్రీ' అని అన్నారు. శ్రీశ్రీ ఒక అభ్యుదయకవిగా విప్లవ కవిగా పౌరహక్కుల నాయకునిగా సమాజంలో జరిగే అన్యాయాలను ఆకృత్యాలను, ఖండించి సాధారణ జనులలో కూడా అసాధారణ చైతన్యాన్ని తీసుకువచ్చిన మహనీయులు శ్రీశ్రీ అని కొనియాడారు.
శ్రీకాకుళ పోరాట సందర్భంగా రాజ్యం నిర్వహిస్తున్న హింసకాండను వర్ణిస్తూ అన్యాయాన్ని ఎదిరించిన వాడు నక్సలైట్ అయితే ,నేను నక్సలైట్ నే అని తన మెడలోనే బోర్డు పెట్టుకుని ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపినారని ఆ తరువాత వారి ప్రస్తావన సినీ రంగంలో ప్రవేశించి అనేక ప్రజాచైతన్య పూరితమైన పాటలు రాశాడని, అలాంటి అభ్యుదయ భావాలు గల కవి, రచయిత గొప్పతనం గురించి విద్యార్థులకు తెలియజేస్తూ శ్రీశ్రీ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సమాజానికి ఎంతో అవసరమని అప్పుడే కుల, మతాలు, ధనిక, పేద తారతమ్యం లేని సమాజం వస్తుందని తెలియజేశారు. ఆది కాలం నుండి ఆధునిక కాలం వరకు దోపిడీకి, అన్యాయానికి గురవుతున్నది పీడిత ప్రజలే,తన ప్రతిభా పాటవాలతో అలాంటి వారిలో పోరాట స్ఫూర్తిని కలిగించి జనాన్ని చైతన్య పరిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు శాఖమూరి రవీందర్ శ్రీనివాస్, రమేష్ రాజు, మాధవి, రజిత, జి రమేష్, పరశురామ్, మున్నయ్య, రాజేందర్, రవీందర్, రమ్య, విద్యార్థులు పాల్గొన్నారు.