calender_icon.png 1 April, 2025 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ సీతారాముల శోభాయాత్ర పర్యావరణ హితంగా నిర్వహించాలి

31-03-2025 01:01:25 AM

ముషీరాబాద్, మార్చి 30: (విజయ క్రాంతి): ప్రజల్లో భక్తి భావాన్ని పెంచేందుకు శ్రీరామనవమి ఉత్సవ సమితి శోభా యాత్ర నిర్వహించడం అభినందనీయమని,  అయితే ఆ యాత్ర ను పర్యావరణ హితంగా నిర్వహించాలని ఉత్సవ సమితికి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ (EPDC )బహిరంగ విజ్ఞప్తి చేసింది. అంబర్ పేట శ్రీ రామ నవ మి ఉత్సవ సమితి కన్వీనర్ డాక్టర్ గౌతమ్ రావు ఆధ్వర్యంలో శనివారం ఉత్సవ సమితి బృందం శోభాయాత్రలో ద్విచక్ర,  త్రిచక్ర,  చతుర్ చక్ర వాహనాలకు అనుమతి కావాలని పోలీస్‌లను కోరిన నేపథ్యాన్ని పురస్కరించుకొని ఈపీ డీసీ వ్యవస్థాపక అధ్యక్షులు రంగయ్య ఆదివా రం ఒక ప్రకటన విడుదల చేశారు. వాహనాల కారణంగా యాత్ర కాలుష్యమయం కాకుండా ఉండేందుకు భక్తులు పాదయాత్ర చేసేలా సమితి చొరవ తీసుకోవాలని కోరారు. భారతీయ సంప్రదాయమే ప్రకృతి సంరక్షణ అని దానికి భిన్నం గా శ్రీరామ నవమి శోభాయాత్ర సాగడం తగదన్నారు. మహానగరంలో ట్రాఫిక్ సమ స్య రాకుండా  పటిష్ట వ్యూహం రూపొందించుకోవాలని కోరుతూ యాత్ర విజయవం తం కావాలని రంగయ్య ఆకాంక్షించారు.