06-04-2025 10:15:11 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శుక్లపక్షం నవమి తిథి అయిన ఆదివారం మండల కేంద్రములో శివరామ మందిరంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేవాలయ ఆలయ ధర్మకర్తలు కొండ అంజయ్య దంపతులతో పాటు ధర్మకర్తలు దేవతామూర్తులను ఊరేగింపుగా తీసుకు వచ్చి శ్రీ సీతారామ చంద్రుల కళ్యాణం జరిపించారు. సీతరామల కళ్యాణం చైత్రశుద్ద నవమి సందర్భంగా నిర్వహించే కల్యాణ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఉదయం 11 గంటల 45 నిమిషాలకు ముహూర్త సమయానికి కళ్యాణ వేడుకలు వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే మండలంలో అన్ని గ్రామాల్లోని శ్రీ సీతారాముల కళ్యాణం వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గోని సీతారాముల కళ్యాణ అనంతరం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ కార్యదర్శి ప్రభు ధర్మకర్తలు పలు పార్టీలకు చెందిన నాయకులు పలుకుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం సీతారాముల కళ్యాణం సందర్భంగా మహిళలు ఓడిబియాలను పోసి మొక్కులు చెల్లించుకున్నారు.