calender_icon.png 8 April, 2025 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా శ్రీ సీతారామల కళ్యాణ మహోత్సవం..

06-04-2025 07:07:12 PM

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శుక్లపక్షం నవమి తిథి అయిన ఆదివారం మండల కేంద్రములో శ్రీ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలను  ఘనంగా నిర్వహించారు. దేవాలయ అర్చకులు శ్రీనివాసచార్యులు వారణాసి కిషోర్ కుమార్ చేతుల మీదుగా భూమగళ్ల ప్రవీణ్ కుమార్- అమిత దంపతులు శ్రీరామ్ కృష్ణ నిహార్-నాగ సంతోషి దంపతులు శ్రీ సీతారామ చంద్రుల కళ్యాణం జరిపించారు. సీతరామల కళ్యాణం చైత్రశుద్ద నవమి సందర్భంగా నిర్వహించే కల్యాణ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉదయం 11 గంటల 45 నిమిషాలకు ముహూర్త సమయానికి  కళ్యాణ వేడుకలు వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. 

అలాగే మండలంలో అన్ని గ్రామాల్లోని శ్రీ సీతారాముల కళ్యాణం వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు పానకం, వడపప్పు, 1000 మజ్జిగ ప్యాకెట్లు  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శెట్టి గిరి సరస్వతి దంపతులు అందజేశారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గోని సీతారాముల కళ్యాణ అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాని తోగంటి వేలాద్రి హైమావతి దంపతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి, మాజీ జడ్పిటిసి నల్లపాటి ప్రమీల శ్రీనివాసరావు మునగాల సొసైటీ  చైర్మన్ కందిబండ సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బుచ్చి పాపయ్య, ఉప్పుల జానకి రెడ్డి దేవాలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.