22-03-2025 08:43:02 PM
జహీరాబాద్: జహీరాబాద్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల యాజమాన్యం మున్సిపాలిటీకి ఆస్తిపన్ను చెల్లించకపోవడంతో పాఠశాలను సీజ్ చేశారు. శనివారం జహీరాబాద్ మున్సిపాలిటీ అధికారులు పాఠశాలలో సీజ్ చేశారు. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆదేశాలు మేరకు మున్సిపల్ అధికారులు అధికారులు చర్యలు తీసుకున్నారు. జహీరాబాద్ లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల రూ. 27 లక్షలు ఆస్తి పన్ను బకాయి ఉందని మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వర్ తెలిపారు. ఆస్తి పన్ను చెల్లించకపోవడం పాఠశాలను సీజ్ చేశామన్నారు.