calender_icon.png 16 March, 2025 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగరంగ వైభవంగా శ్రీ సంతాన వేణుగోపాల స్వామి కల్యాణ మహోత్సవం

15-03-2025 10:59:11 PM

కోదాడ: కోదాడ మండలం,  తొగర్రాయి గ్రామం లోని ప్రముఖ శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది.  స్వామివారు అమ్మవార్లకు తిరుకళ్యాణ మహోత్సవం జరిపారు. విశ్వక్సేన పూజ,  పుణ్యాహవాచనం, రక్షాబంధనం, పట్టువస్త్రాలు సమర్పణ,  జీలకర్ర బెల్లం,  ఆభరణాల సమర్పణ, మాంగల్య ధారణ,  ముత్యాల తలంబ్రాలు వంటి వైదిక క్రతువులను వేద మంత్రాలతో వేద పండితులు నల్లాన్ చక్రవర్తుల రామకృష్ణ ఆచార్య, రాజన్ ఆచార్య, దేవాలయ అర్చకులు ముడుంబ విష్ణువర్ధన ఆచార్య,  గ్రామ పురోహితులు రాకేష్ శర్మ, నందుల లక్ష్మీనరసింహశాస్త్రి,   దేవాలయ చైర్మన్ అమరనాయిని వెంకటేశ్వరరావు, యాదా రమేష్, శ్రీనివాసరావు, అచ్యుతారాం, దేవరశెట్టి నారాయణరావు, దేవాలయ కమిటీ సభ్యులు  సింగరయ్య, ఏడుకొండలు, ఉపేందర్, గోపిరెడ్డి, యర్రయ్య, పల్లె బాబు మరియు హరిహర భజన మండలి కార్యకర్తలు దొంగల అనిత, నాగమణి, లింగేశ్వరి, లక్ష్మి, రాంబాయి, అరుణ  పాల్గొన్నారు.