calender_icon.png 8 April, 2025 | 8:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీరామనవమి కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం

06-04-2025 08:03:04 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని పలు మండల కేంద్రాలు, గ్రామాలలో శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం సీతారాముల కళ్యాణం ఘనంగా వైభవంగా నిర్వహించారు. శ్రీరామ నవమి సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని శ్రీరామ కాలనీ రామాలయం, బాన్సువాడ రూరల్ మండలం దేశాయిపేట రామాలయం, కొల్లూరు రామాలయం, తిర్మలాపూర్ రామాలయం, బీర్కూరు మండల కేంద్రంలోని రామాలయం స్వగ్రామం పోచారం రామాలయాలలో జరిగిన సీతారాముల కళ్యాణంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి సతీమణి పుష్పతో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి, శ్రీరామనవమి సందర్భంగా స్వామి వారి కళ్యాణంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు అతని సోదరుడు పోచారం శంభు రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పోచారం సురేందర్ రెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.