06-04-2025 04:46:00 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని గోడల పంపు, గోసంపల్లి, మస్కాపూర్, ఖానాపూర్ గ్రామాల రామాలయాల్లో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్య జాన్సన్ నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖశాంతులతో బ్రతకాలి అనేది రామరాజ్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తాల్లపల్లి రాజా గంగన్న, గౌరీకర్ రాజు, సుద్దాల మహిపాల్, అజయ్ తదితరులు ఆయన వెంట ఉన్నారు.