06-04-2025 06:38:33 PM
రామనామ జపంతో హోరెత్తిన దేవాలయాలు..
కళ్యాణం తిలకించేందుకు పోటెత్తిన భక్తులు..
భక్తులకు మహా అన్నదానాలు..
వైరా (విజయక్రాంతి): వైరా మండలంలో అన్ని గ్రామాలలో శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని వాడవాడల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగింది. వైరా శ్రీ కోదండరామ స్వామి దేవాలయంలో, వైరా కూరగాయల మార్కెట్లో అత్యంత వైభవపీతంగా స్వామి వారి కళ్యాణం మంత్రోచ్ఛరణతో ఘనంగా కళ్యాణ నిర్వహించారు. మండలంలోని గొల్లపూడి శ్రీ పులిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వైరా శిరిడి సాయిబాబా మందిరం శ్రీ హరిహర సుత అయ్యప్ప క్షేత్రం సోమవరం దాసాంజనేయ స్వామి దేవాలయంలో కళ్యాణం నిర్వహించారు అన్ని దేవాలయాల్లో రామనామ జపంతో భక్తులు హోరెత్తించారు. కళ్యాణం తిలకించేందుకు భక్తులు పోటెత్తారు.
స్వస్తిశ్రీ వ్యవహారిక చాంద్రమానైన శ్రీ విశ్వా వసు నామ సంవత్సరం చైత్ర మాస శుద్ధ నవమి పునర్వసు నక్షత్ర యుక్త అభిజిత్ లగ్నం సుముహూర్తమున అయోధ్య నగరాధీశులు శ్రీ దశరథ మహారాజు జేష్ట పుత్రుడు శ్రీరామచంద్రమూర్తికి మిధుల నగరాధీశులు శ్రీ జనక మహారాజు జేష్ట పుత్రిక శ్రీ సీతాదేవితో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ఐదు నిమిషాలకు దేవాలయాల్లో కళ్యాణం నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజల తమ గోవులను ఎద్దులు గొర్రెలను దేవాలయం ప్రాంగణం చుట్టూ తిప్పి పూజలు నిర్వహించారు. శ్రీ కోదండ రామస్వామి దేవాలయం శ్రీ శిరిడి సాయిబాబా మందిరంలో భాజా భజంత్రీలు సందడితో రాములోరీ కళ్యాణం కమనీయంగా కన్నుల పండుగ జరిగింది. ఈ అపురూప దృశ్యాన్ని కనులారా తిలకించేందుకు భక్తులు దేవాలయాల్లో పోటీత్తారు.
శ్రీరామ జై రామ జై జై రామ అంటూ శ్రీరామ నామస్మరణతో ఎటు చూసినా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నామ జపంతో భక్తజనం సందోహం పులకించింది. శ్రీ కోదండరామ స్వామి దేవాలయంలో మిట్టపల్లి నాగేశ్వరరావు(గోల్డ్ షాప్) అనురాధ దంపతులు మిట్టపల్లి జగన్మోహన్రావు మహాలక్ష్మి దంపతులు మిట్టపల్లి శ్రీనివాసరావు మంజుల దంపతులు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో నంబూరి రామారావు శ్రీదేవి దంపతులు లగడపాటి బోస్ దంపతులు, రాయల శ్రీనివాసరావు రోజా దంపతులు పీటల మీద కూర్చొని కళ్యాణం నిర్వహించారు. శ్రీ కోదండ రామాలయంలో స్వచ్ఛంద సంస్థ శ్రీ వైష్ణవి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మజ్జిగ వాటర్ ప్యాకెట్లను అందించారు.
భక్తులకు ప్రసాదాలను సాకేత్ కృష్ణ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ పెరుమాల కృష్ణమూర్తి పద్మావతి దంపతులు అందించారు. గొల్లపూడి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం శ్రీ హరిహర సుత అయ్యప్ప క్షేత్రం గొల్లగూడెం కోదండ రామాలయంలో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. షిరిడి సాయిబాబా మందిరంలో మూడు ప్రత్యేక కౌంటర్లలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు చింతలపూడి వెంకటేశ్వరరావు ఏడు నూతల బుచ్చి రామారావు రంగా సత్యనారాయణ చెరుకూరు శ్రీనివాసరావు అబ్బూరి రమేష్ బాబా మందిరం చైర్మన్ పొడపాటి నాగేశ్వరరావు కమిటీ సభ్యులు మాదినేని దుర్గాప్రసాద్ మిద్దె సుబ్బారావు నల్లమోతు వెంకటేశ్వరరావు తల్లపరెడ్డి గోపాలకృష్ణారెడ్డి అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు.
గొల్లగూడెం రామాలయంలో ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ కాపా మురళీకృష్ణ ఉండ్రు శ్యాం బాబు లగడపాటి ప్రభాకర్ రావు తోటకూర శ్రీకాంత్ గంగవరపు కిషన్ రాయి కళ్యాణంలో పాల్గొని అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. శ్రీ కోదండరామ స్వామి దేవాలయంలో మాజీ శాసనసభ్యులు కొండబాల కోటేశ్వరరావు కట్టా కృష్ణార్జునురావు మిట్టపల్లి సత్యంబాబు వైరా మండల ఆర్యవైశ్య అధ్యక్షులు మిట్టపల్లి కిరణ్ కుమార్ డాక్టర్ పెరుమాళ్ళ కృష్ణమూర్తి కొప్పురావూరి శబరినాథ్ శ్రీరామనేని శ్రీనివాసరావు వైరా సర్కిల్ ఇన్స్పెక్టర్ సాగర్ దంపతులు ఎస్సై వంశీకృష్ణ భాగ్యరాజు దంపతులు ఈవో ఎస్ వై డి ప్రసాద్ మేనేజర్ శ్రీనివాసరావు తదితరులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.