calender_icon.png 13 April, 2025 | 9:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రిలో చక్రతీర్థం స్నానంతో ముగిసిన శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు

12-04-2025 10:36:46 PM

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ముగింపు కార్యక్రమం శనివారం నాడు నిర్వహించారు. ఉదయం స్వామివారి సుదర్శన చక్రానికి సాంప్రదాయ బద్దంగా చక్రతీర్ధ స్నానం పవిత్ర గోదావరి నదిలో నిర్వహించారు అర్చకులు. ముందుగా పునర్వసు మండపంలో ఉత్సవ మూర్తులకు, సుదర్శన చక్రానికి విశేష స్నపనం, పుణ్యాహవచనం, తిరుమంజనంతో పాటు చూర్ణోత్సవం, నవకలశ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

అనంతరం పవిత్ర గోదావరి నది లో సుదర్శన చక్రాన్ని మేళతాళాలతో తీసుకువచ్చి గోదావరి నదిలో సుదర్శన చక్రానికి చక్ర తీర్ధ  స్నానం నిర్వహించారు ఆలయ అర్చకులు. నేడు పవిత్ర గోదావరి నదిలో భక్తుల సమక్షంలో సుదర్శన చక్ర తీర్ధ స్నానం ఆచరించి భక్తులు సైతం గోదావరి నది లో చక్ర తీర్ధ స్నానమాచరించి పునీతులయ్యారు. సాయంత్రం యాగశాలలో పూర్ణాహుతి తో స్వామివారి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి.

భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణాలు ప్రారంభం

శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని రద్దు చేసిన నిత్య కళ్యాణాలు 13వ తేదీ నుండి ప్రారంభం అవుతాయని దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి తెలిపారు.