calender_icon.png 20 April, 2025 | 11:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు శ్రీరామనవమి శోభాయాత్ర

05-04-2025 12:08:28 AM

సీతారాంబాగ్ మందిర్ నుంచి మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభం

ముఖ్యఅతిథులుగా తెలంగాణ గవర్నర్, గోవర్ధన్ పీఠాధిపతి, త్రిపుర డిప్యూటీ స్పీకర్

భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి

హైదరాబాద్ సిటీబ్యూరో,(విజయక్రాంతి): శ్రీరామనవమి సందర్భంగా భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీరామనవమి శోభాయాత్ర చారిత్రక సీతారామ్ భాగ్ దేవాలయం నుంచి మధ్యాహ్నం 1గంటలకు ప్రారంభమవుతుందని ఉత్సవ సమితి అధ్యక్షుడు డా. భగవంత్‌రావు, ప్రధాన కార్యదర్శి గోవింద్ రాఠీ తెలిపారు. శుక్రవారం బెహాటీ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... శ్రీరామ నవమి సందర్భంగా సీతారాంబాగ్ దేవాలయంలో నిర్వహించే వేడుకలకు ముఖ్యఅతిథులుగా ఆదివారం 11 మధ్య తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ పాల్గొంటారని తెలిపారు. మరో ముఖ్‌య అతిథిగా గోవర్ధన్ పీఠ్ అనంత్ శ్రీ విభుషిత్ జగద్గురు శంకరాచార్య స్వామి శ్రీ అదోక్ష్‌జనద్ దేవ్ తీర్ధ్ మహారాజ్, త్రిపుర డిప్యూటీ స్పీకర్ రామ్ ప్రసాద్ పాల్‌లు పాల్గొంటారని చెప్పారు. 2010 నుంచి నిర్విరామంగా శోభాయాత్రను నిర్వహిస్తున్నామని పేర్కొన్నరు.