calender_icon.png 9 April, 2025 | 1:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపే రాములోరి పెళ్లి..

05-04-2025 04:26:59 PM

వేడుకలకు ముస్తాబైన కోదండ రామాలయం

బెల్లంపల్లిఅర్బన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో శ్రీరామనవమి పర్వదిన వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ కోదండ రామాలయం అందంగా ముస్తాబయింది. రంగులు దిద్ది దేవాలయాన్ని ఆకర్షణీయంగా తయారు చేశారు. విద్యుత్ దీపాలను  అలంకరించారు. సీతారాముల కల్యాణ మహోత్సవం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ వేడుకలు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు.

ఎండోమెంట్ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. వేలాదిగా భక్తులు సీతారాముల కల్యాణోత్సవానికి హాజరై ముక్కులు తీర్చుకుంటారు. తొమ్మిది రోజులపాటు నవరాత్రి ఉత్సవాలు రామాలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అదేవిధంగా పట్టణంలోని రైల్వే స్టేషన్, టేకులబస్తీ ప్రాంతాల్లోని శ్రీ కోదండ దేవాలయాల్లో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇప్పటికే ఏర్పాట్లు అన్ని ఆయా దేవాలయాల్లో పూర్తయ్యాయి. వేడుకలకు సర్వ సన్నద్ధం చేశారు.