calender_icon.png 7 April, 2025 | 5:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళ్యాణం వైభోగం..

06-04-2025 03:52:11 PM

కమనీయం సీతారాముల కళ్యాణం 

వేద పండితుల ఆధ్వర్యంలో కల్యాణ తంతు

వేలాదిగా తరలివచ్చిన భక్తజనం 

కన్నుల పండుగ వేడుక 

కుమ్రంభీం అసిఫాబాద్,(విజయక్రాంతి): శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆసిఫాబాద్ పట్టణంలోని జనకాపూర్ శ్రీ కోదండ రామాలయం ఆవరణలోని కళ్యాణ మండపంలో వేద పండితులు నిమ్మకంటి సంతోష్ శర్మ ఆధ్వర్యంలో రాజశేఖర్ శర్మ, పూర్ణచందర్, శిరిష్ శర్మ , అభయ్  ఆచార్య, నరేష్ శర్మ, విజయ్ కుమార్, ఆనంద్, ఆచార్య తిరుపతిలు వేదమంత్రోత్సవాల నడుమ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుక కమనీయంగా నిర్వహించారు. ఆలయ అర్చకుడు  వినాయక్ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి కల్యాణ వేడుకకు చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఎమ్మెల్యే కోవా లక్ష్మి దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు.

సాయంత్రం ఉత్సవ విగ్రహాలతో జానకా(కి) పుర్ లో శోభయాత్ర నిర్వహించారు. పద్మశాలి సంఘం, బీసీ సంక్షేమ సంఘం, వాసవి క్లబ్, కాంగ్రెస్ పార్టీ, శ్రీ వాసవి హై స్కూల్, యూత్ కాంగ్రెస్ పార్టీ, సాయిని సంతోష్ అండ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో మజ్జిగ, మంచినీటి నీ పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో మాజీ జెడ్పిటిసి అరిగెల నాగేశ్వరరావు, సినీ దర్శక నిర్మాత దండ నాయకుల సురేష్ కుమార్,మాజీ ఎంపీపీలు మల్లికార్జున యాదవ్ బాలేష్ గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ మల్లేష్, చిలువరి వెంకన్న, గంధం శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు సత్యనారాయణ, సిరిపురం భద్రయ్య, చిలుకూరి రవి, శివచందు, శైలేందర్, చిప్ప మహేష్, నాగరాజు, జగన్, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.