06-04-2025 05:31:35 PM
శోభాయమానంగా శ్రీరాముడి శోభాయాత్రలు..
భారీ పోలీసు బందోబస్తు..
బైంసా (విజయక్రాంతి): నిర్మల్, భైంసాలో ఆదివారం శ్రీ రామ నవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నిర్మల్ లోని దేవరకోట, భైంసాలో గోశాల నుంచి శ్రీరాముని శోభయాత్రలను ఉత్సవ కమిటీలు పూజలు చేసి ప్రారంభించారు. ఎంపీ నగేష్, ఎమ్మెల్యే రామారావు పటేల్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో రెండు పట్టణాల్లో ఇద్దరు ఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు 700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర మార్గంలో ఉన్న సీసీటీవీ లను పొలీస్ స్టేషన్ పరిధిలో గల కంట్రోల్ రూం లో అనుసంధానం చేసి గట్టి నిఘాను ఏర్పాటు చేశారు.