calender_icon.png 7 April, 2025 | 6:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు

06-04-2025 05:15:55 PM

మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల నియోజకవర్గంలోని నస్పూర్, మంచిర్యాల, హాజీపూర్, లక్షెట్టిపేట, దండేపల్లి మండలాల్లోని పలు ఆలయాలలో ఆదివారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ ఉత్సవాల్లో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. అర్చకులు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుని ఆశీర్వదించి, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ సీతారాముల దీవెనలు ఉండాలని ఆశీర్వదించారు. అనంతరం భక్తులందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.