05-04-2025 12:38:50 AM
ఎల్బీనగర్: ప్రసిద్ధి చెందిన కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానములో ఆదివారం శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో లావణ్య తెలిపారు. 6వ తేదీన ఉదయం 10 గంటలకు సీతారామచంద్ర స్వామి వార్ల కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. రూ.516 రుసుము చెల్లించిన భక్తులకు కల్యాణంలో పాల్గొనే అవకాశము కల్పిస్తామని తెలిపారు. ఉదయం 10 గంటలకు కల్యాణం, సాయంత్రం 6 గంటలకు రథోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉత్సవాల్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు.
ప్రజాప్రతినిధులకు ఆలయ కమిటీ ఆహ్వానం
కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం(Karmanghat Hanuman Temple)లో నిర్వహిస్తున్న సీతారాముల కల్యాణ ఉత్సవాలకు హాజరుకావాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, చంపాపేట కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డికి ఈవో లావణ్య, ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేసి, ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ధర్మకర్త మధుసాగర్, ఆలయ అధికారి వెంకటయ్య, అర్చకులు సంతోష్, ముత్యాల శర్మ, పవన్ తదితరులు పాల్గొన్నారు.