calender_icon.png 7 April, 2025 | 12:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాచలంలో వైభవోపేతంగా సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవం

06-04-2025 01:14:17 PM

భద్రాచలం,(విజయక్రాంతి): శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో వైభవంగా ఆదివారం జగదభిరాముడి కల్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. అభిజిత్ లగ్నంలో శ్రీరామచంద్రమూర్తి సీతమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. మిథిలా మైదానంలో జరిగిన సీతారాముల కల్యాణ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున  పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మంత్రులు కొండాసురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.