27-03-2025 12:00:00 AM
ఊరేగింపు మార్గాన్ని పరిశీలించిన డీసీపీ, అధికారులు
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 26(విజయక్రాంతి) : శ్రీరామ నవమి సందర్భంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ డా.బి.బాలస్వామి, అడిషనల్ డీసీపీ జె. నర్సయ్య, సుల్తానాబాద్ ఏసీపీ కె.శంకర్, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, జలమండలి, విద్యుత్ శాఖ, తదితర అధికారులు, అఫ్జల్‌గంజ్, సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్ల పరిధిలో రూట్‌ను పరిశీలించారు. బేగంబజార్ చత్రి, స్వస్తిక్‌మిర్చి, బర్తన్‌బజార్, ఎస్‌ఏబజార్ మసీదు, శంకర్‌శేర్ హోటల్ క్రాస్‌రోడ్, గౌలిగూడ, పుట్లీబౌలి, ఆంధ్రబ్యాంక్, కోఠి, హనుమాన్‌వ్యాంశాల, తదితర ప్రాంతాలను పరిశీలించారు.