calender_icon.png 8 April, 2025 | 5:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కనువిందు చేసిన 'రాములోరి' పెండ్లి

06-04-2025 06:40:19 PM

పెన్ పహాడ్: సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల వ్యాప్తంగా శ్రీ రామ నవమిని పురస్కరించుకొని ఆయా గ్రామాలలో అశేష భక్తులు, వేద పండితుల మంత్రోత్సవాలు నడుమ నిర్వహించిన సీతారాముల కళ్యాణం అంగరంగ వైభావంగా కనువిందు చేసింది. ఈ సందర్బంగా రాములోరి కళ్యాణం, పురాణాలు, రామాయణం గొప్పతనం చాటెందుకు సీతారాముల కళ్యాణం ఘట్టం గొప్పదని మాజీ జడ్పీటీసీ మామిడి అనితా ఆంజయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ తూముల భుజంగరావు అన్నారు. ఈ సందర్బంగా దేవతమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో బైరెడ్డి సంజీవరెడ్డి బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పొదిల నాగార్జున,  దంతాల వెంకటేశ్వర్లు, చవగాని రాములు, మలిగిరెడ్డి అనంతరెడ్డి, గజ్జల కృష్ణారెడ్డి, మలిగిరెడ్డి చెన్నారెడ్డి, బైరెడ్డి రాంరెడ్డి ముజీబ్, మామిడి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.