calender_icon.png 21 March, 2025 | 10:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీరామ ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన

21-03-2025 07:10:57 PM

ప్రతి ఒక్కరూ ఆరోగ్యపరమైన విషయంలో జాగ్రత్తలు వహించాలి: డాక్టర్ శ్రీకర్

హుజురాబాద్,(విజయక్రాంతి): ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎండి జనరల్ ఫిజీషియన్, డయోబెటాలజిస్ట్ డాక్టర్ మోడెపు శ్రీకర్(Diabetologist Dr. Modepu Srikar) అన్నారు. శుక్రవారం హుజురాబాద్ పురపాలక సంఘం కమిషనర్ కేంసారపు సమ్మయ్య, శ్రీరామ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో  మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన శ్రీరామ ఉచిత వైద్య శిబిరానికి(Sri Rama Free Medical Camp) భారీ స్పందన వచ్చింది. ఈ శిబిరానికి మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, కార్మికులతో పాటు హుజురాబాద్ లోని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉచిత వైద్య శిబిరంలో వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అదేవిధంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. 

ముఖ్యంగా వేసవి కాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి అవసరాలున్న ఉదయం 10 గంటల లోపే ముగించుకోవాలన్నారు. ఎండాకాలంలో నీళ్లతోపాటు వివిధ రకాల పండ్ల రసాలను తీసుకుంటే మంచిదని అన్నారు. నేటి సమాజంలో చాలామంది డయాబెటిస్తో బాధపడుతున్నారని, షుగర్ వ్యాధి గ్రస్తులు రమేష్ తప్పకుండా షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుకోవాలని అన్నారు. షుగర్ లెవెల్స్ అధికంగా పెరిగితే చాలా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని, ప్రతి నెలకోసారి షుగర్ పరీక్షలు చేయించుకుంటే వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య, శ్రీరామ ఆస్పత్రి యాజమాన్యం నంబి భరణి కుమార్, ముష్కే శ్రీనివాస్, పూరి, ఆసుపత్రి సిబ్బంది సతీష్, తిరుపతి, సునీత, ఐశ్వర్య, అంజలి, శిరీష, సంధ్య, దీపిక తదితరులు పాల్గొన్నారు.