19-04-2025 12:11:56 AM
హాజరైన బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఏ.వినయ్ కుమార్
ముషీరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లి బాపునగర్ లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారి 41వ వార్షికోత్సవ వేడు కలు ఆలయ నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు వేడుకలకు ముఖ్య అతిథిగా బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ బీజేపీ నాయకులతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆల య అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. ఈ అమ్మవారి 41వ వార్షికోత్సవ వేడుకలు19వ తేది వరకు కొనసాగుతాయని కమిటీ సభ్యు లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అద్యక్షులు వీ.నవీన్ కుమార్, సీనియర్ నాయకులు రత్న సాయి చంద్,దామోదర్, శ్రీకాంత్, పి. నర్సింగ్ రావు, ఆలయ కమిటీ సభ్యులు అందోల్ రాజు, మహేష్,సాయి పాల్గొన్నారు.