11-04-2025 07:56:01 PM
కొల్చారం,(విజయక్రాంతి): మెదక్ జిల్లా కొల్చారం మండలం పరిధిలోని పోతంశెట్టిపల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి ఒకటోవ వార్షిక మహోత్సవ వేడుకల్లో భాగంగా మొదటిరోజు శుక్రవారం పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామ పురోహితులు సాంబశివశర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణల మధ్య శ్రీ పెద్దమ్మ తల్లి కల్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. వార్షికోత్సవానికి నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి హాజరై పెద్దమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గడ్డమీద శ్రీనివాస్ ఎమ్మెల్యే ను శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గడ్డమీద శ్రీనివాస్,మాజీ ఎంపీపీ మంజుల కాశినాథ్,నర్సింలు, యాదగిరి,షేకులు, శివ,శ్రవణ్, కిష్టయ్య,తదితరులు పాల్గొన్నారు.