calender_icon.png 8 October, 2024 | 6:05 PM

Breaking News

శ్రీ పర్వతవర్ధని అలంకారంలో అమ్మవారు..

08-10-2024 03:04:32 PM

యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి): ప్రసిద్ద పుణ్య క్షేత్రం యాదగిరిగుట్ట అనుబంధ ఆలయమైన శ్రీ పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆరవ రోజు మంగళవారం పర్వత వర్ధిని అలంకారంలో అమ్మవారి దర్శనం ఇచ్చారు. ప్రాతఃకాల పూజ అర్చనలు పారాయణములు గాయత్రీ జపములు  లలిత సహస్రనామార్చన మధ్యాహ్న పూజ నీరాజన మంత్రపుష్పములు తీర్థప్రసాద వితరణ జరిగినది. సాయంకాలం శ్రీదేవి నవావరణ పూజ సహస్రనామార్చన నీరాజనం మంత్రపుష్పములు తీర్థప్రసాద వితరణ జరుగును.