27-02-2025 08:06:18 PM
చేగుంట,(విజయక్రాంతి): మెదక్ జిల్లా నర్సింగ్ మండలం కేంద్రంలో శ్రీశ్రీశ్రీ కేతకి భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. నేడు యాదవ్ సంఘం ఆధ్వర్యంలో స్వామి వారికి బోనాలు, గంపలు, ఒగ్గు కళాకారుల వేషధారణ నృత్యాలతో మల్లన్న కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతం శ్రీనివాస్ రెడ్డికి, గొర్రె పిల్లను బహకరించారు. ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం అధ్యక్షులు, సభ్యులు కాంగ్రెస్ సినియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు