calender_icon.png 15 November, 2024 | 5:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీలంక ఎన్నికలు ప్రశాంతం

15-11-2024 02:05:29 AM

65 శాతం ఓటింగ్ నమోదు..

నేడు ఫలితాలు విడుదల

కొలంబో, నవంబర్ 14: శ్రీలంకలో గురువారం పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దేశవ్యాప్తంగా 225 పార్లమెంట్ స్థానాలు ఉండగా, నేషనల్ లిస్ట్‌లో 29 స్థానాలు ఉన్నాయి. అవిపోను మిగతా 196 స్థానాల పరిధిలో సుమారు 1.70 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 8,821 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. 65 శాతం ఓటింగ్ నమోదైంది.

దేశాధ్యక్షుడు అరుణకుమార దిస్సనాయకే నేతృత్వంలోని అధికార ‘నేషనల్ పీపుల్స్ పవర్’ పార్టీకి ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా పరిణమించాయి. సెప్టెంబర్ 21న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అరుణకుమార దిస్సనాయకే 50శాతం ఓట్లు సాధించలేకపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 113 స్థానాలు దక్కించు కోవాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాతినిధ్య ఓట్ల ఆధారంగా ఎంపీల ఎన్నిక ఉంటుంది.

ప్రతి ఓటరు ముగ్గురు అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో ఓటు వేయవచ్చు. మొత్తం 225 పార్లమెంట్ స్థానాల్లో 196 స్థానాలకు ఎన్నిక ఇలా జరుగుతుంది. మిగతా 29 సీట్లను నేషనల్ లిస్ట్ పరిధిలో ఉంటాయి. వీటి కేటాయింపు రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల గ్రూప్‌లకు ఉంటుంది.