న్యూజిలాండ్‌దే వన్డే సిరీస్
ఆక్లాండ్: సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్ సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక (66), కుశాల్ మెండిస్ (54), జనిత్ లియాన్గే (53) అర్థశతకాలతో మెరిశారు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ 4 వికెట్లు పడగొట్టగా.. మిచెల్ సాంట్నర్ 2 వికెట్లు తీశాడు. అనంతరం న్యూజిలాండ్ లక్ష్య ఛేదనలో 29.4 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది. మార్క్ చాప్‌మన్ (81) ఒంటరి పోరాటం చేశాడు. అశితా ఫెర్నాండో, తీక్షణ, మలింగ తలా 3 వికెట్లు పడగొట్టారు. పొదుపుగా బౌలింగ్ చేసిన అశితా ఫెర్నాండో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు. మాట్ హెన్రీ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’కు ఎంపికయ్యాడు. టీ20 సిరీస్‌ను కూడా న్యూజిలాండ్ 2 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.