కొలంబో: త్వరలో యూఏఈ వేదికగా జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్ కోసం శ్రీలంక బోర్డు శుక్రవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. చమేరీ ఆటపట్టు కెప్టెన్‌గా వ్యవహరించనుంది. సీనియర్ ఎడం చేతి వాటం స్పిన్నర్ రణవీరకు సెలెక్టర్లు చోటు కల్పించారు. 2024 మహిళల టీ20 క్వాలిఫయర్స్ ఆడిన జట్టులో రణవీర ఆడింది. యూఏఈ పిచ్‌ల మీద స్పిన్ ప్రభావం చూపనున్న నేపథ్యంలో లంక ఈ స్పిన్నర్‌కు చోటు కల్పించింది. ఈ ప్రపంచకప్‌లో గ్రూప్ ఉన్న శ్రీలంక తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 3న పాకిస్థాన్‌తో ఆడనుంది. ఆ తర్వాత వరుసగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారత్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. అంచనాలను మించి రాణిస్తోన్న శ్రీలంక ఇటీవలే మహిళల ఆసియా కప్ నెగ్గిన సంగతి తెలిసిందే.