calender_icon.png 19 April, 2025 | 7:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి రథోత్సవం

14-04-2025 01:16:52 AM

కృష్ణ, ఏప్రిల్13: మండలంలో ని గుడెబల్లూర్ వెలసిన శ్రీ శ్రీ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం ఆదివారం తెల్లవారుజామున గోవింద నామ స్మరణలతో అంగరంగ వైభవంగా జరిగింది అంతకుముందు స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ఎండోమెంట్ అధికారి శ్యాంసుందర్ చారి ఎమ్మెల్యేకు శాలువాతో సన్మానించారు.

ఆలయ అర్చకులు  తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ రథోత్సవ మహోత్సవ కార్యక్రమంలో కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ నుండి భక్తులు పెద్ద ఎత్తున రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఈవో మరియు సిబ్బంది అఖిలపక్ష నాయకులు గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.