17-03-2025 12:07:07 AM
మోర్తాడ్, మార్చి 16 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల కేంద్రంలో జరిగే శ్రీ వేంకటేశ్వర స్వామి జాతర ప్రతి సంవత్సరం హొలీ పండగ తర్వాత మూడవ రోజు అయినా విదియ రోజున జాతర నిర్వహి స్తారు.
జాతరను పురస్కరించుకొని మోర్తాడ్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం మాడ వీధుల గుండా శ్యావను ను ఊరేగింపుగా భక్తులకు దర్శనం కావిస్తారు. భక్తుల కోరికలు తీర్చే వెంకటేశ్వర స్వామి. అతిపెద్దది పురాతనమయిన ఆలయం శ్రీ వేంకటేశ్వర స్వామికి చెందినది కావడం గమనార్హం. చెక్క రథాన్ని 1932లో గడ్డం మల్లారెడ్డి తయారు చేశారు.
ఆలయ పూజారి దంపూరి ప్రవీణ్ తెలియజేసిన వివరాల ప్రకారం పురాతన ఆలయాలలో ఒకటైన మోర్తాడ్ శ్రీ వేంకటేశ్వర స్వామి గురించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. తిరుపతికి వెళ్లి స్వామిని దర్శించుకోలేని భక్తుడు పరమాత్ముడిని ప్రార్థించగా, పాము రూపంలో అవతరించి శ్రీ వేంకటేశ్వర స్వామి మోర్తాడ్లోని ఈ ఆలయంలో దర్శనం ఇచ్చారని భక్తుల నమ్మకం.
మోర్తాడ్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం జాతర కోసం చుట్టుపక్క ల జిల్లాల వాసులే కాకుండా ధర్మపురి లక్ష్మీనరసింహ జాతరను సందర్శించి నేరుగా మోర్తాడ్ జాతరకు వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వెళ్లేవారని స్థానికులు తెలుపుతున్నారు. జాతర ఏర్పట్లను మోర్తాడ్ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలకుండా అన్ని ఏర్పాట్లు చేసింది,