calender_icon.png 15 March, 2025 | 6:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగరంగ వైభవంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం

15-03-2025 12:40:35 AM

మునగాల మార్చి 14: సూర్యాపేట జిల్లా మునగాల భక్తిశ్రద్ధలతో కొలిసిన వారికి కొంగుబంగారం వలే వరాలు ప్రసాదించే శ్రీ రేపాల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా  గురువారం రాత్రి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి  కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మండల పరిధిలోని రేపాల గ్రామంలో స్వామి వారి కళ్యాణానికి ముందు ఆలయ ఆవరణలో  వందలాదిమంది భక్తుల సమక్షంలో లక్ష్మీనరసింహస్వామి చెంచులక్ష్మి రాజ్యలక్ష్మి అమ్మవార్ల విగ్రహాలను పల్లకిలో ఏర్పాటుచేసి డోలు సన్నాయి వాయిదాలు, కాగడాల దీపోత్సవాలతో ఆలయ అర్చకులు వేదమంత్రోత్సవాలతో అంగరంగ వైభవంగా కనుల పండువగా  ఎదుర్కోల కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. అనంతరం కళ్యాణ మండపంలో స్వామివారి అమ్మవార్లకు సాంప్రదాయవకంగా కళ్యాణాన్ని జరిపించారు. ఈ సందర్భంగా ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామివారి కల్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాల స్వీకరించారు.