11-03-2025 12:22:25 AM
-ముఖ్యఅతిథిగా పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ
యాదాద్రి భువనగిరి, మార్చి 10 (విజయక్రాంతి): యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు దివ్యంగా దీదీప్యమానంగా కొనసాగుతున్నాయి. పదవ రోజుకు చేరుకున్న బ్రహ్మోత్సవాలు సోమవారం నాడు. స్వామివారి ఆలయంలో ఉదయం నిత్యారాధన అనంతరం మహా పూర్ణాహుతి, చక్రతీర్థం కార్యక్రమాలను అర్చకులు, ప్రధాన అర్చకులు, యజ్ఞాచార్యులు, పేద పండితులు, ఉప ప్రధాన అర్చకులు, అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అనువంశిక ధర్మకర్త బీ.నరసింహమూర్తి, ఆలయ ఈవో భాస్కరరావు, ఉప కార్య నిర్వహణ అధికారులు పాల్గొన్నారు.