08-02-2025 07:57:18 PM
ఆలయంలో పూజలు చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి..
10న స్వామివారి కళ్యాణం..
కడ్తాల్ (విజయక్రాంతి): కడ్తాల్ పట్టణంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయ ఉత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 14 వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. తొలిరోజు స్వస్తివాచనం, ఆకాండ దీపారాధన, ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. నేడు అమ్మవారికి ప్రత్యేక పూజలు, లలిత సహస్రనామ, పారాయణం, ఎదుర్కోళ్లు 10న స్వామివారి కల్యాణోత్సవం, తెల్లవారుజామున శివాలయం దగ్గర అగ్నిగుండాలు, 11న లక్ష పుష్పార్చన, స్వామివారికి ప్రత్యేక పూజలు, రాత్రి 11 గంటలకు పుష్ప మాల సేవా, రథోత్సవం (చిన్న తేరు), 12న కుంకుమార్చన, బ్రహ్మ రథోత్సవం, 13న దోపోత్సవం, స్వామివారికి పూజలు, 14న చక్రతీర్థం, గరుడసేవ, పూజలు తదితర కార్యక్రమాలు ఉంటాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. మొదటి రోజు స్థానిక నాయకులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.