తలకొండపల్లి, ఫిబ్రవరి 4 (-విజయ క్రాంతి): చుక్కాపూర్ గ్రామ శివారు ప్రాంతంలోని వెలిసిన అతి పురాతనమైన దేవాలయం బ్రహ్మోత్సవాల కార్యక్రమాలలో ఈనెల మూడు నుండి ఏడు వరకు నిర్వహించి తలపెట్టిన బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం దేవాలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి కళ్యాణోత్సవం కనుల విందుగా కొనసాగింది.
స్వామివారి కళ్యాణాన్ని గ్రామానికి చెందిన ఆర్‌ఎన్‌ఆర్ డెవలపర్స్ ఏమిరెడ్డి ప్రియాంక-పాండురంగారెడ్డి దంపతులు కళ్యాణాన్ని జరిపించారు. ఈ కళ్యాణాన్ని వేద పండితులు ఆంజనేయ శర్మ, వెంకటేశ్వర శర్మ, శ్యాం సుందర శర్మ, రామ శంకర శర్మల ఆధ్వర్యంలో కళ్యాణాన్ని భక్తిశ్రద్ధలతో జరిపించారు. ఈ సందర్భంగా భక్తులకు పాండురంగారెడ్డి దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్యాంసుందర్ గుప్తా దంపతులు, నాయకులు, మాజీ ఎంపీపీ లక్ష్మీదేవి రఘురాములు, డిసిసి సభ్యులు మోహన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు దాసరి యాదయ్య, మాజీ ఉపసర్పంచ్ జక్కు శ్రీనివాస్ రెడ్డి, అంజిరెడ్డి, డేవిడ్, యాదయ్య గౌడ్ రంగారెడ్డి, శేఖర్ రెడ్డి, మల్లారెడ్డి, పెద్దయ్య గౌడ్, సత్తిరెడ్డి, మధుసూదన్, శ్రీనివాస్ రెడ్డి, రామచంద్రయ్య, జంగారెడ్డి ,బుచ్చిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, యాదయ్య, సంతోష్ రెడ్డి, మల్లయ్య వెంకటయ్య, కాలూరు నరసింహ, విరాట్, కొప్పు యాదయ్య,పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామనాథం, ఉపాధ్యాయ బృందం మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.