calender_icon.png 7 February, 2025 | 10:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు

07-02-2025 12:00:00 AM

  • రేపటి నుంచి 14వరకు ఉత్సవాలు, ఏర్పాట్లు చేసిన 
  • నిర్వాహకులు 10న స్వామివారి కల్యాణం 

కడ్తాల్, ఫిబ్రవరి 6 (విజయ క్రాంతి): కడ్తాల్ పట్టణంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయ ఉత్సవాలు ఈ నెల 08నుంచి 14వరకు కొనసాగనున్నాయి. ఉత్సవాల ఏర్పాట్లను ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

8న స్వస్తివాచనం, ఆకాండ దీపా రాధన, ప్రత్యేక పూజలు, 09న అమ్మవారికి ప్రత్యేక పూజలు, లలిత సహస్రనామ, పారాయణం, ఎదుర్కోళ్లు 10న స్వామివారి కల్యాణోత్సవం, తెల్లవారుజామున శివాలయం దగ్గర  అగ్నిగుండాలు.

11న లక్ష పుష్పార్చన, స్వామివారికి ప్రత్యేక పూజలు, రాత్రి 11గంటలకు పుష్ప మాల సేవా, రథోత్సవం (చిన్నతేరు). 12న కుంకుమా ర్చన, బ్రహ్మ రథోత్సవం. 13న దోపోత్సవం, స్వామివారికి పూజలు. 14న చక్రతీర్థం, గరుడసేవ, పూజలు తదితర కార్యక్రమాలు ఉంటాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.