తలకొండపల్లి, ఫిబ్రవరి 3(విజయక్రాంతి):తలకొండపల్లి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం నిర్వహించిన స్వామి వారి కళ్యాణమహోత్సవానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హజరయ్యారు. నిర్వాహకులు ఎమ్మెల్యేకు స్వామి వారి కండువాతో ఘనంగా స్వాగతం పలికారు.
ఎమ్మెల్యే వెంట రాష్ట్ర పొల్యుషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ బాలాజీసింగ్, పిసిసి కార్యవర్గ సభ్యులు అయిల్ల శ్రీనివాస్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ గట్ల కేశవరెడ్డిలు ఉన్నారు.చుక్కాపూర్ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామిబ్రహ్మోత్సవాలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. 4న నిర్వహించే స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా సోమవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని నిర్వాహకులు కలిసి ఆహ్వాన పత్రిక అందజేసి ఆహ్వానించారు.