26-03-2025 12:42:59 PM
భద్రాచలం(విజయక్రాంతి): ఖమ్మంలోని శ్రీ లక్ష్మీ బాలాజీ సేవాసమితి(Sri Lakshmi Balaji Seva Samithi) సభ్యులు స్వామివారికి గొటి తలంబ్రాలను బుధవారం నాడు భక్తిశ్రద్ధలతో దేవస్థానం అధికారులకు సమర్పించారు. ఈ పవిత్ర కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరై, భక్తి భావంతో స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. కార్యనిర్వాహన అధికారి రమాదేవి, ఏ ఈ ఓ శ్రావణ్ కుమార్, సూపరిండెంట్ సాయిబాబా, కత్తి శీను ఆధ్వర్యంలో దేవస్థానం సిబ్బంది భక్తులకు అన్ని సౌకర్యాలు అందించారు. భక్తుల పూజా సామగ్రి, తలంబ్రాల సమర్పణ, దర్శన ఏర్పాట్లు సజావుగా జరిగేలా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టంగా నిర్వహించారని నిర్వాహకులు తెలిపారు. ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. భక్తులకు మెరుగైన సేవలందించేందుకు ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని దేవస్థానం అధికారులు పేర్కొన్నారు.