కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో యాదవ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రధాన విధుల గుండా ర్యాలీ నిర్వహించారు .అనంతరం యాదవ సంఘం వద్ద జెండా ఆవిష్కరించి శ్రీకృష్ణ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హుట్టి కొట్టే కార్యక్రమాన్ని చేపట్టి విజేతలకు బహుమతులను అందజేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మల్లికార్జున యాదవ్ ,యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.