యాదాద్రి భువనగిరి, ( విజయక్రాంతి): త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల స్వామి వారి దివ్య ఆశీస్సులతో ఇందూ జ్ఞాన వేదిక ప్రబోధా సేవా సమితి యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు 26-08-2024 నుండి 02-09-2024 వరకు 8 రోజులు వీధి ఉత్సవ పందిరిలో స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం శ్రీకృష్ణ భగవానుడిని పల్లకీలో భువనగిరి పట్టణంలోని పురవీధులలో ఊరేగింపు కార్యక్రమం చేయడం జరుగుచున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ,పోతంశెట్టి వెంకటేశ్వర్లు మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు వడిచెర్ల లక్ష్మి కృష్ణ యాదవ్, పోత్నక్ ప్రమోద్ కుమార్, పచ్చాల జగన్మోహన్, మాజీ కౌన్సిలర్ తాడూరి నరసింహ, కాంగ్రెస్ నాయకులు తంగళ్ళపల్లి రవి, పట్టణ కాంగ్రెస్ నాయకులందరూ రోటరీ క్లబ్ అధ్యక్షుడు కరిపే నర్సింగ్ రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందూ జ్ఞాన వేదిక సభ్యులు భువనగిరి, చేర్యాల, జనగాం, తొర్రూరు, ఎలుకతుర్తి, హైదరాబాద్, హుజురాబాద్ శాఖల నుండి పాల్గొన్నారు. దేవేందర్ శంకర్, లక్ష్మీనారాయణ, నాగరాజు, భాస్కర్, శశికాంత్, కుమార్, లతా, లలిత ధనలక్ష్మి, తదితరులు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కలియుగ మొదట్లో దేశవ్యాప్తంగా చేసేవారు ఇప్పుడు ఇండ్లకు మాత్రమే పరిమితి అయింది అలా కాకుండా పూర్వ వైభవాన్ని తీసుకొని రావడానికి ప్రతి ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు 11 రోజులు నిర్వహిస్తున్నామని తెలిపినారు.