calender_icon.png 16 January, 2025 | 8:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీరభద్ర యాదవ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

26-08-2024 05:30:41 PM

యాదాద్రి భువనగిరి,(విజయక్రాంతి): భువనగిరి పట్టణ స్థానిక నల్గొండ చౌరస్తాలోని రామాలయం గుడి ప్రాంగణంలో ఉన్న వీరభద్ర యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ గోపాలకృష్ణ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వీరభద్ర యాదవ సంఘం అధ్యక్షులు వల్లపు బాలమల్లు ప్రధాన కార్యదర్శి నక్కల జగదీష్ యాదవ్ ఆధ్వర్యంలో ఉదయం నుండి నవగ్రహ పూజతో ప్రారంభమై స్వామివారికి అభిషేకం, హోమం, శ్రీ కృష్ణ వ్రతం ఘనంగా నిర్వహించడం జరిగింది. కీర్తిశేషులు నక్కల లక్ష్మయ్య గారి జ్ఞాపకార్థం కుమారుడు వీరభద్ర యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కల జగదీష్ యాదవ్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్, యాదవ సంఘం నాయకులు శెట్టి బాలయ్య యాదవ్, నక్కల ఆదినారాయణ పాల్గొని అన్న వితరణ చేశారు. ఈకార్యక్రమంలో పట్టణం పుర ప్రముఖులు, ప్రజలు హాజరై స్వామి వారి దర్శనం చేసుకున్నారు. యాదవులతో పాటు అన్ని సామాజిక వర్గాల చెందిన ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారు.