calender_icon.png 4 April, 2025 | 6:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు

04-04-2025 12:28:27 AM

  1. భద్రాద్రి నీ తలపించే రామాలయం 
  2. దక్షిణ భారతదేశంలో లేని మూలవిరాట్ విగ్రహాల ప్రతిష్ట 
  3. రామాయణం తలపించే గాలిగోపురం 
  4. 5 నుండి 9వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు

గోపాలపేట, ఏప్రిల్ 03: 300 ఏళ్ల క్రితం గోపాలపేట సంస్థానంలో నిర్మించిన శ్రీ కోదండరామ స్వామి ఆలయం లోని ఈనెల 5 నుండి 9 వరకు శ్రీ సీతారామ స్వామి బ్రహ్మోత్సవాలు. ఎంతో అంగరంగా వైభవంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహ కులు  వేగంగా పూర్తి చేస్తున్నారు.

ఆలయ చరిత్ర

పూర్వం 300 ఏళ్ల క్రితం సంస్థానాల దిశలు భద్రాద్రి రాముడు నీ తలపించేలా శ్రీ కోదండరామ స్వామి ఆలయాన్ని నిర్మించి నఈ ఆలయం వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలో కొలువై ఉంది. సంస్థాన దిశల్లో ఒకరైన. రాజా నరసింహారెడ్డి హనుమండ్ల గడ్డ సమీపంలో ఆంజనేయస్వామి ఆలయం నిర్మించి తూర్పు దిశగా మొఖం ఉండేలా ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రదర్శించారు.

కొంతకాలం తర్వాత వారి తదనం తరం గోపాలపేట సంస్థానా దిశల్లో రాణి రంగనాయకమ్మ పాలన కొనసాగించి నట్లు పెద్దలు చెప్పుకుం టారు. కాగా రాణి రంగనాయకమ్మకు స్వప్నంలో స్వప్నంలో ఆంజనేయ స్వామి కనబడి నా ఆలయం పక్కన నా స్వామి రాములవారి ఆదాయాన్ని నిర్మించాలని స్వా స్వామి స్వప్నంలో కనబడి ఆదేశించినట్లు రాణీ రంగనాయకమ్మ ప్రజలకు తెలియజేసినట్లు పెద్దలు చెప్పారు.

దీంతో రాణి రంగనాయకమ్మ హుటాహుటిన మంత్రికి ఆదేశించారు నలు దిక్కులు నలుమూలల్లో గాలించి చిత్రకారులను వెంటనే రప్పించాలని ఆజ్ఞాపించారు. చిత్ర రంగంలో రాటు తేలిన చిత్రకారులు ఆంజనేయస్వామి ఆలయం పక్కనే అందమైన రాములవారి గర్భగుడిని నిర్మించారు. స్వామివారి గర్భగుడికి ఎదురుగా సీతారాముల వారి రామాయణం తలపించే విధంగా ఎంతో అందంగా ఏడంతస్తుల గాలిగోపురాన్ని నిర్మించారు.

అంతేకాకుండా ప్రతి ఏటా శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరిపించేందుకు. దేవత మూర్తులు ఉండి రాముల వారి కళ్యాణం జరిపిస్తున్నట్లు అందమైన చిత్రాలతో ఎంతో అందంగా కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సీతారాముల వారి అభిషేకం భూగర్భ జలంతో చేయాలని గాలిగోపురానికి ఎదురుగా రాతితో పుష్కరిణి ఏర్పాటు చేసినట్లు పెద్దలు చెప్పుకుంటారు.

రాములవారి గర్భగుడిలో సీతా, రాముడు, లక్ష్మణుడు ఆంజనేయ విగ్రహాలను ప్రతిష్టించేందుకు దేశ నలుమూలల తిరిగి ఎక్కడ కూడా లేని మూలవిరాట్ విగ్రహాలను రానీ రంగనాయకమ్మ తెప్పించి అహోబిలం పీఠాధి పతులచే సీతారాముల వారి విగ్రహాలను ప్రతిష్టించిన అనంతరం నెల రోజులపాటు సంస్థానాదిశలు బ్రహ్మోత్సవాలను నిర్వహించినట్లు పెద్దలు చెప్పుకుంటున్నారు.

సీతా రాముల వారి కళ్యాణాన్ని ముత్యాల తలంబ్రాలతో అంగరంగ వైభవంగా సంస్థానాదిశులు రంగనాయకమ్మ జరిపిస్తున్నట్లు పెద్దలు ఈ ఉత్సవాలనుజిల్లా నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తిలకిస్తుండేవారని పెద్దలు చెప్పుకుంటారు.

వీరి తర్వాత రాను రాను ఉత్సవాల నిర్వహణ తగ్గుముఖం పట్టింది. గ్రామస్తులంతా ఏకమై ఎంతో ప్రతిష్టగాంచిన శ్రీ కోదండరామ స్వామి రామాలయం శిథిలావసక్ చేరుతుందని గ్రామస్తుల్లో కొంతమంది దాతలు ముందుకు వచ్చి స్వామివారి దీపారాధన ఆలనా పాలన చూస్తున్నారు..

స్వామివారి బ్రహ్మోత్సవాలు

 ఈనెల ఐదున ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు ఐదున ఉదయం10 గంటల నుంచి అంకురార్పణ ధ్వజారోహణ నిత్య నేమికం అభిషేకం తదిత కార్యక్రమాలు జరుగుతాయి. అరుణ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రత్యేక పూజలు తోపాటు 10 సమయంలో శ్రీ సీతారామస్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుందని అలాగే 7, 8, 9 తేదీల లో ఆలయంలో ప్రత్యేక పూజలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు రంగాచార్యులు తెలిపారు.