22-02-2025 09:07:10 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ రెవెన్యూ డివిజన్ కేంద్రంలోని సంగమేశ్వర్ కాలనీలో గల శ్రీ కనక దుర్గాదేవి ఆలయం మొదటి వార్షికోత్సవ వేడుకలను ఆలయ ధర్మకర్త పోచారం ప్రేమల శంభు రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఆలయ కమిటీ ప్రతినిధుల పర్యవేక్షణలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి పంచామృత అభిషేక లతో పూజలు చేసి, అందంగా ముస్తాబు చేసి ధూప, దీప, నైవేద్యాలు సమర్పించి హారతులు ఇచ్చారు. అనంతరం సామూహిక కుంకుమార్చన మహోత్సవం చేపట్టారు. ఈ సందర్భంగా పల్లకి సేవా నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు ఆలయ ధర్మకర్త పోచారం ప్రేమాల, శంబురెడ్డి ఆర్థిక సౌజన్యంతో ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో భాగస్వాములయ్యారు. భక్తి గీతాలతో, అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఆలయంలో అర్చకులు కాశీ సంతోష్ శర్మ, విజయ్ పంతులు, మతం సంగమేశ్వరప్ప ,మతం సంతోష్ అప్పల, మం త్రో చరణాల నడుమ పూజలు జరిగాయి. రాత్రికి భజన, అల్పాహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీ కనకదుర్గ దేవి ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు మామిళ్ల రాజు, కార్యనిర్వాహక కమిటీ గ్రామ పెద్దలు కాలనీవాసులు పాల్గొన్నారు.