24-03-2025 11:36:13 PM
మహదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం హుండీలను సోమవారం కార్యనిర్వహణాధికారి మహేష్ ఆధ్వర్యంలో లెక్కించడం జరిగింది. ఈ హుండీల లెక్కింపు పర్యవేక్షణ అధికారిగా ఇన్స్పెక్టర్ కవిత పర్యవేక్షించారు. హుండీల మొత్తం ఆదాయం 90 రోజులకు గాను 36,87,415/- రూపాయల ఆదాయం వచ్చింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ శ్రీనివాస్, యూనియన్ బ్యాంక్ సిబ్బంది, దేవస్థానం సిబ్బంది, అన్నమయ్య సేవా ట్రస్ట్ కరీంనగర్ సభ్యులు, కామారెడ్డి, శ్రీ రాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు, శ్రీ వళ్ళి సేవా ట్రస్ట్ కరీంనగర్ సభ్యులు పాల్గొన్నారు. కాళేశ్వరం ఎస్సై తమాషా రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు.